పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాస్‌లో వినేశ్ పిటిషన్ వేయగా.. అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై ఐవోఏ లాయర్ విదుష్పత్ సింఘానియా మాట్లాడుతూ.. తీర్పుకాపీ సింగిల్‌లైన్ ఆర్డర్ మాత్రమే వచ్చిందని చెప్పారు. తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు 10-15 రోజుల్లో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.