కిస్ మిస్ లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ గాతింటుంటారు. అయితే మీరు ఒక నెల పాటు వీటిని పరిగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసా?ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కేలరీలు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ,విటమిన్ కె, విటమిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు వీటిని ఒక నెల పాటు పరిగడుపున తిన్నట్టైతే ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే?
మెరగైన జీర్ణక్రియఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. కిస్ మిస్ లోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. మీరు కంటిన్యూగా వీటిని నెలపాటు పరిగడుపున తింటే మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు.
నియంత్రణలో రక్తపోటు
ఎండుద్రాక్షల్లో పొటాషియం కూడా మెండుగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. మీకు బీపీ సమస్య ఉంటే వీటిని ఒక నెల పాటు తినండి. ఇది మీ బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం
కిస్ మిస్ లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి బాగా సహాయపడతాయి. వీటిని తింటే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
రక్తహీనతను నివారిస్తుంది.
కిస్ మిస్ లల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఒంట్లో రక్తం తగ్గుతుంది. ఇది విపరీతమైన అలసట. బలహీనతలను కలిగిస్తుంది.