చాలామంది గుండె స్తంభించటం, గుండెపోటు రెండూ ఒకటేనని భావిస్తుంటారు. నిజానికివి వేర్వేరు సమస్యలు. గుండెకు రక్త ప్రసరణ ఆగితే గుండెపోటు (హార్ట్ ఎటాక్) తలెత్తుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో పూడికలు ఏర్పడినప్పుడు ఇది సంభవిస్తుంది. మరోవైపు, గుండె పనితీరు అస్తవ్యస్తమై, హఠాత్తుగా కొట్టుకోవటం ఆగటాన్ని గుండె స్తంభించటం (కార్డియాక్ అరెస్ట్) అంటారు. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది.