రోజుకు మూడువేల అడుగులు వేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనానికి ముందు.. రోజుకు సగటున 4 వేల అడుగులు వేసిన వృద్ధులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
వారి పరిశోధన ఫలితంగా రక్తపోటు నియంత్రణకు రోజుకు సగటున 3 వేల అడుగులు లక్ష్యమని నిర్ణయించారు. మూడు వేల అడుగులు అంటే దాదాపు ఒక కిలోమీటర్ అని అర్థం. ఇలా ప్రతిరోజూ నడవడం వల్ల అధిక రక్తపోటును కూడా తగ్గించవచ్చని ఈ పరిశోధన తెలిపింది.