రావి చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రావి ఆకుల చూర్ణాన్ని మజ్జిగలో లేదా పాలలో కలిపి తాగితే జ్వరం రాదు. రావి, అంజూర, మర్రి ఆకులను మరిగించిన నీటిని తాగితే మహిళలకు పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
రావి ఆకుల పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే చర్మ సమస్యలు నయం అవుతాయి. జలుబు, దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసే శక్తి ఈ చెట్టు బెరడుకు ఉంది.