మధ్యాహ్నం భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కడుపులోని ఆమ్లం ఛాతి వైపు పైకి ఎక్కి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే శ్వాస నాళాలు కుచించుకుపోయి గురక సమస్య వస్తుంది.