చాలా మంది తరచూ మటన్ తింటుంటారు. అయితే మటన్ ఎక్కువగా తినే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దాదాపు పదేళ్ల పాటు వారు అధ్యయనం చేశారు. సహజ ఇన్సులిన్‌ను మటన్‌లోని హానికారక శాచురేటెడ్ కొవ్వులు అడ్డుకుంటున్నట్లు వారి అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన మటన్ తినే వారికి ఈ ముప్పు ఎక్కువని వారు పేర్కొన్నారు.