యువతులు బిగుతుగా ఉండే జీన్స్‌ను ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీన్స్ చర్మానికి గట్టిగా ఉండి, చెమటను బయటకు వెళ్లనివ్వదు. దీంతో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
జీన్స్ రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. దీంతో నొప్పులు, వాపులు వస్తాయి. జీన్స్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. నరాలను నొక్కి, నొప్పిని కలిగిస్తాయి. అలాగే, పునరుత్పత్తి వ్యవస్థ సమస్యలను తెచ్చిపెడుతుంది.