హైరిటర్న్స్ కోసం ఈక్వీటీ పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి నెలలో కోట్లాది రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, చాలా మంది ఇప్పటికే మార్కెట్లలో మంచి రాబడులు అందించిన స్కీమ్స్ ఎంచుకుంటుంటే.. కొంత మంది కొత్త ఫండ్ల కోసం వేచి చూస్తుంటారు. కొత్త మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడులు అందుకోవచ్చని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ వారు మూడు మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ కాబోతున్నాయి. వివిధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు స్పెషల్ డిజైన్‌తో ఈ ఈస్కీమ్స్ తీసుకొస్తున్నాయి.
ఈ వారం సబ్‌స్క్రిప్షన్‌కి వస్తున్న మూడు న్యూ ఫండ్ ఆఫర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. అదే. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 14 రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌కి అవకాశం కల్పించారు. అంటే అక్టోబర్ 4, 2024 వరకు అవకాశం ఉంటుంది. ఇందులో మూడేళ్లకుపైగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు అందుకోవచ్చని హెచ్‍డీఎఫ్‌సీ ఫండ్ హౌస్ సూచిస్తోంది. అయితే ఇందులో వెరీ హైరిస్క్ ఉంటుందని హెచ్చరించింది. ఈ స్కీమ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ లార్జ్‌మిడ్ క్యాప్ 250 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ ఉంది. ఈ ఫండ్ మేనేజర్లుగా నిర్మాన్ ఎస్. మొరాఖియా, అరున్ అగర్వాల్ ఉన్నారు. ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించింది సంస్థ.
మరోవైపు.. ఈ వారం సబ్‌స్క్రిప్షన్‌కి వస్తున్న న్యూ ఫండ్ ఆఫర్లలో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఉంది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 16వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 18తో ముగుస్తుంది. అంటే ఇన్వెస్టర్లకు రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక గ్రో నిఫ్టీ 1డీ రేట్ లిక్విడ్ ఈటీఎఫ్ స్కీమ్ సైతం ఈవారమే సబ్‌స్క్రిప్షన్‌కి వస్తోంది. ఈ స్కీమ్ సెప్టెంబర్ 16వ తేదీన సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై సెప్టెంబర్ 20తో ముగియనుంది. ఈ మూడింటిలో రెండు ఈటీఎఫ్ ఫండ్స్ ఉండగా.. ఒకటి ఇండెక్స్ ఫండ్ ఉంది.