ప్రస్తుత తరుణంలో చాలా మంది జంటలకు సంతానం ఉండడం లేదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దంపతులకు అయితే పిల్లలు అసలు పుట్టడం లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.కానీ పిల్లలు ఎందుకు పుట్టరో అర్థం కాదు. అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మహిళలు పీరియడ్స్ వచ్చాక కొన్ని రోజులకు శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో మహిళల శరీరంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తాయట. వాటిని అర్థం చేసుకుని శృంగారంలో పాల్గొంటే అప్పుడు గర్భం దాల్చవచ్చు.. అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా మహిళలందరికీ ఒకేలాంటి రుతుక్రమం ఉండదు. కొందరు మహిళలకు 28 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. కొందరికి 30, 32 రోజులు కూడా పడుతుంది. అయితే పీరియడ్స్ అయిన తరువాత 10 నుంచి 15 రోజుల మధ్యలో శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మహిళలకు శృంగార కాంక్ష కూడా పెరుగుతుంది. బిజీగా, ఆందోళనగా ఉండే మహిళలకు ఈ కాంక్ష ఉండకపోవచ్చు. కనుక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకుంటే ఆటోమేటిగ్గా మనసు శృంగారం వైపునకు మళ్లువుతుంది.
కనుక ఈ సమయంలో మహిళలు ఈ లక్షణాలు కనిపిస్తే శృంగారంలో పాల్గొనవచ్చు. దీంతో గర్భం దాల్చే చాన్స్ అధికంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక పీరియడ్స్ వచ్చాక 10 నుంచి 15 రోజుల మధ్యలో మహిళల ఛాతి లేదా నడుము భాగంలో కాస్త నొప్పిగా కూడా ఉంటుందని అంటున్నారు. ఈ లక్షణాలను గమనించి శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు మెరుగు పడతాయి. కనుక మహిళలు అలా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు.