విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 40ఏళ్ల బ్రావో తన చివరి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్ లో గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. '21 సంవత్సరాల ప్రొఫెషనల్ క్రికెటర్ గా నా ప్రయాణం ఎత్తుపల్లాల మధ్య సాగింది. నాకు అన్నీ అందించిన ఆటకు ఈరోజు నేను వీడ్కోలు పలుకుతున్నాను' అని బ్రావో రాసుకొచ్చారు.