ఇంగ్లాండ్‌కు తొలిసారి నాయకత్వం వహిస్తున్న హ్యారీ బ్రూక్ ఆసీస్‌పై మరోసారి చెలరేగి ఆడాడు. ఆదివారం ఐదో వన్డేలో బ్రూక్ (72; 52 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక రన్స్ చేసిన కెప్టెన్‌గా కోహ్లీ (310) పేరిట రికార్డు ఉండేది. తాజాగా బ్రూక్ ఐదు వన్డేల్లో 312 పరుగులు చేసి కోహ్లీని అధిగమించాడు.