ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమావాస్య అత్యంత పవిత్రమైన తిథి .. అమావాస్య పూజలు ఎలా చేయాలి

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 10:55 AM

అమావాస్య చాలా విశేషం, ఇంటికి దిష్టి తియ్యండి , పిల్లలకు దిష్టి తీయండి , ఈ అమావాస్య లక్ష్మీ పూజకు విశేషం, అమావాస్య పూజలు ఎలా చేయాలి.ఉదాహరణకు ఇక్కడ కొన్ని చెప్పాను గమనించండి. అమావాస్య నాయకి అయిన జగన్మాత ఆ రోజు కామేశ్వరి స్వరూపంగా కామేశ్వరుడితో ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కనుక అమావాస్య పూజ త్వరగా అనుగ్రహిస్తుంది, మంత్రం సిద్దిస్తుంది. #లలిత, లక్ష్మి, కాళీ, భైరవ ఉపాసకులు సంధ్య కాలం విశేష పూజ చేయాలి, దీప లక్ష్మీ పూజ చేయాలి, అఖండ దీపాన్ని ప్రారంభించడానికి మంచి సమయం. 


అమావాస్య రోజు ఎలా చేయాలి ... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిదో చూద్దాం ... 


అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ  ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి


 


అమావాస్య రోజు లక్ష్మీ_దేవిని పూజించాలి అనుకునే వారు.. మీరు #కమలాత్మిక_హైమావతి సంపుటికరణ అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి #కమలాత్మిక_ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు.


 


అమావాస్య రోజు భైరవ_ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి  మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది.#ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..


కాళీ_మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు  ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .


దుర్గా_మాతకు విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం, ఆ రోజు పసుపు నీళ్లతో  అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి  దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.


అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు. #మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com