జామ ఆకుల్ని తినడం వల్ల షుగర్, బీపీ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులలో ఉండే ఫినోలిక్ సమ్మేళనం, పొటాషియం, ఫైబర్ యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. జామ ఆకుల్ని తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. ఇవి బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు జామ ఆకుల్ని నములుతూ ఉంటే చాలా మంచిదని అంటున్నారు.