అధిక బరువు.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తీసుకుంటున్న ఆహారం మొదలు, మారిన జీవన విధానం కారణం ఏదైనా..ఊబకాయం సాధారణ సమస్యగా మారిపోయింది. దీంతో బరువు తగ్గడానికి ఎన్నో కుస్తీలు పడుతుంటారు.వ్యాయామం మొదలు, డైటింగ్ వరకూ చేయని పని అంటూ ఉండదు. అయితే జీలకర్ర నీటిని తాగితే ఇట్టే బరువు తగ్గొచ్చని మీకు తెలుసా.? ప్రతీ రోజూ ఉదయం జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా జీలకర్రను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే జరిగే మార్పులు మీ ఊహకు కూడా అందవని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీ రోజూ జీలక్రర నీటిని తాగితే అదనపు బరువు నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియను, జీవ క్రియలను మెరుగుపరచుకోచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకుంటే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులోని ఆంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఇక జీలకర్రతో షుగర్ కంట్రోల్ అవుతుందని. అంతేకాదండోయ్.. జీలకర్ర వాటర్ ఆర్థరైటిస్‌ను కూడా తగ్గిస్తుందని, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో దోహదపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జీలకర్ర వాటర్ ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గుండె సమస్యలు రాకుండా చేస్తాయి.
ప్రతీ రోజూ రాత్రి ఒక టీస్పూన్ జీలకర్రను గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే లేవగానే ఈ నీటిని వడకట్టుకొని తాగాలి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. కేవలం నీటిని మాత్రమే కాకుండా జీలకర్రను పొడిగా చేసుకొని అప్పుడప్పుడు తిన్నా మంచి లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.