అధిక బరువుతో, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పెరుగు తినకపోవడమే ఉత్తమం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా సమస్యలు వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండె జబ్బులు, వివిధ స్ట్రోక్స్ ఎదురయ్యే ప్రమాదముంది. అందుకే కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పెరుగును తింటే కొలెస్ట్రాల్ మరింత పెరిగే ముప్పు ఉంది. పెరుగుకు బదులు.. పల్చగా మజ్జిగ చేసుకుని తాగితే ఉత్తమమని వైద్య నిపుణులు చెబుతున్నారు.