ఇడ్లీ పిండిని మనం ఎక్కువగా పులియబెడతాం. దీని వల్ల ఇడ్లీలు ఈజీగా జీర్ణమవుతాయి. ఇవి మన గట్ హెల్త్‌కి కూడా చాలా మంచివి. ఇడ్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల చాలా వరకూ కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి అవ్వదు. వీటిలోని మినపప్పు వల్ల మనకి ఐరన్ అందుతుంది. ఇడ్లీలలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతాయి.