ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో లవంగం ప్రధానమైంది. దాదాపు ప్రతీ కూరలో లవంగం ఉపయోగించాల్సిందే. వంటకు రుచిని ఇచ్చే లవంగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.?అందుకే ఆయుర్వేదంలో కూడా లవంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ ఒక లవంగాన్ని నమలడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఊహకు కూడా అందనవి నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లవంగం తింటే శరీరంలో జరిగే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* జీర్ణ సంబంధిత సమస్యలతో బాధడపేవారికి లవంగం బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విడగొట్టడంతో లవంగం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో లవంగం బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. లవంగం తీసుకోవడం వల్ల తరచూ వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
* పంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా లవంగా కీలక పాత్ర పోషిస్తుంది. లవంగంలోని యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చిగుళ్ల సమస్య, పిప్పి పన్ను వంటి సమస్యలను దూరం చేస్తుంది. అందుకే లవంగం ఫ్లేవర్‌తో కూడిన టూత్ బ్రష్‌లను తయారు చేస్తుంటారు. లవంగం నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగపడుతుంది.
* డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతీ రోజూ లవంగాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిండచంతో పాటు ఇన్సూలిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది.
* గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ లవంగాన్ని నమలాలి.ఇందులోని శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట సమస్యను తగ్గయిస్తాయి. ప్రాణాంతక వ్యాధులను దూరం చేయడంలో తోడ్పడుతాయి.
* లివర్ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా లవంగాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. లవంగం డిటాక్సిఫైర్ లా పనిచేస్తాయి. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేటీవ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది. లివర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా ఫ్యాట లివర్ సమస్యను నివారిస్తుంది.