పుట్టగొడుగులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇంకా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా దోహదపడుతుంది.