పోపు డబ్బాల్లో వాము కచ్చితంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు.. ఉదయాన్నే వాము నీళ్లు తాగడం వల్ల పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గుతారు..కానీ చెప్పేవాళ్లే కానీ చేసే వాళ్లు తక్కువ.పరగడుపున వాము నీళ్లు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కానీ.. ఆ వాములు మీరు ఇంకొన్ని యాడ్ చేయడం వల్ల అరే ఈ వాము నీళ్లు తాగినప్పటి నుంచి కడపులో, గుండెల్లో మంటగా ఉంటుంది అని తాగడం మానేస్తారు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వాము మాత్రమే కలిపి తీసుకుంటే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. అవేంటంటే..రోజూ పరగడుపునే వాము నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఆకలి లేని వారు ఈ నీటిని తాగితే ఆకలి పెరుగుతుంది.
వాము నీటిని తాగడం వల్ల జీర్ణక్రియలో వేగం పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుంది.సీజనల్‌గా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను తగ్గించేందుకు వాము నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.వాము నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు.వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. బాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు రోజూ వాము నీటిని తాగడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.దగ్గు సమస్య ఉన్నవారు వాము నీళ్లను తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో వాము నీళ్లను తాగవచ్చు.వాము నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గిపోతాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.రోజూ పరగడుపునే గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ వాము పొడిని కలుపుకుని తాగవచ్చు. లేదా 2 టీస్పూన్ల వామును రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని అలాగే మరిగించి, వడకట్టి తాగవచ్చు. ఎలా తాగినా మంచిదే.. మూడు రోజుల పాటు తాగితే మార్పు మీరే గమనిస్తారు. రాత్రి నిద్రపోయో ముందు, ఉదయాన్నే పరగడపును చేసే పనుల వల్ల మన ఆరోగ్య స్థితిలో మార్పులు వస్తాయి.!