చాలా మంది మజ్జిగలో చక్కెర కలుపుకొని తాగుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, మజ్జిగలో ఎక్కువ చక్కెరను కలిపి తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.