ఆహారంపైనే మన శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జంక్ ఫుడ్స్‌తో చక్కెర, ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
జంక్ ఫుడ్స్ వల్ల డిప్రెషన్ కూడా పెరుగుతుందని తాజాగా USకి చెందిన మానసిక వైద్యుడు డేనియల్ అమెన్ వెల్లడించారు. ఒత్తిడితో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్‌ను మానేయాలని సూచించారు.