రోజులో చివరి భోజనానికి పడుకునే సమయానికి మధ్య తగినంత విరామం చాలా ముఖ్యమని కన్సల్టెంట్ డైటీషియన్ & డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా పేర్కొన్నారు. పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు చివరి భోజనాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇది జీర్ణక్రియ, జీవక్రియ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు. అలాగే మెరుగైన & నాణ్యమైన నిద్రను అందించడంతో పాటు హృదయ నాళాల పనితీరుకు దోహదపడుతుందని తెలిపారు.