ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయల్లో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. బూడిద గుమ్మడికాయకు చలువ చేసే గుణం ఉంటుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి.