ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. మెంతులు, మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి.చికెన్, మటన్, కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణ కావడమే కాకుండా.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా సహాయ పడతాయి. వారంలో రెండు, మూడు సార్లు ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. మెంతి కూరను వారంలో రెండు సార్లు అయినా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు అన్నీ మెంతి కూరలో లభిస్తాయి. మెంతి కూర తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మెంతి కూరలో ఉండే పోషకాలు:
క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:
బ్యాడ్ కొలెస్ట్రాల్‌తో బాధ పడేవారు ఖచ్చితంగా మీ డైట్‌లో మెంతి కూర ఉండేలా ప్లాన్ చేసుకోండి. మెంతి కూర తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నగా కరిగి పోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
జీర్ణ సమస్యలు:
మెంతి కూరలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కంట్రోల్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి, మల బద్ధకం, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడకుండా చేస్తుంది.
వెయిట్ లాస్:
బరువు తగ్గాలి అనుకునే వారు కూడా మెంతి కూరను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు బరువును అదుపులో ఉంచుతాయి. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు.
డయాబెటీస్ కంట్రోల్:
డయాబెటీస్‌తో బాధ పడే వారు కూడా మెంతి కూరను ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం మెంతి కూర దివ్యౌషధంగా పని చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చర్మ సమస్యలు అన్నీ కంట్రోల్ అవుతాయి.