కడప జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా పులివెందులకు విచ్చేసిన బీసీ సంక్షేమ , జోలి శాఖ మాత్యులు ఎస్. సవిత కి పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి, పులివెందుల టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలో పలు సమస్యలపై మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.లింగాల కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి అన్నారు. లింగాల పాత చెరువుకు పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్ (సీబీఆర్) కుడికాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా శనివారం ఆయన నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులకు నీటిని విడుదల చేస్తామన్నారు. అనంరం దీపం-2 పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు.