రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్ టోటల్‌గా ఫెయిల్ అయిందని, శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, విధి నిర్వహణలో హోం మంత్రి ఘోరంగా విఫలమయ్యారని. మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, వారిపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు.
వీటన్నింటికీ సీఎం చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు పోలీస్ వ్యవస్థను రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వాడుకుంటున్నారంటూ, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో, ప్రజల దృష్టి మళ్లించేందుకు.. ఆ అరెస్టులను, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. రెండింటినీ కలుపుతూ పవన్‌కళ్యాణ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారని ఆక్షేపించారు. ఆ దిశలోనే ఆయన, హోం మంత్రిపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు.