ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్, జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా భారీగా పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు భారీ ప్రోత్సాహకాల్లో హరియాణా ముందుండేది. అయితే సీఎం చంద్రబాబు సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ ప్రోత్సాహకాలిచ్చేలా ప్రతిపాదించారు.
ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారిని గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అదే విధంగా స్పోర్ట్స్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, క్రీడాశాఖ కార్యదర్శి వినయ్ చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.