నాగులచవితి సందర్భంగా సోమవారం పాచిపెంట మండలం పనుకువలస సమీపంలో పుట్టవద్ద మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కుటుంబ సభ్యులతో పాటు నాగేంద్రునికి పూజలు చేశారు. నాగేంద్రునికి పుట్టలో పాలు, నువ్వుల ముద్ద, గుడ్లు వేశారు. సంస్కృతి సంప్రదాయాలను పాటించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి బాట నడవాలని, పంటలు సుభిక్షంగా పండి, ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రార్ధించారు.