గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్ కనెక్షన్ మంగళవారం కట్ చేశారు. అక్టోబర్ మాసానికి సంబంధించిన ఇంటర్నెట్ బిల్లు చెల్లించకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేశారు.
దీంతో సచివాలయ ఉద్యోగులు సెల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని సర్వీసులు చేస్తున్నారు. దీంతో ప్రజలకు సర్వీసులు సక్రమంగా అందడం లేదు.