పుస్తక పఠనం నిరంతర ప్రక్రియగా అలవర్చుకోవాలని రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ అన్నారు. ఈ మేరకు రాజాం పట్టణంలో మంగళవారం విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సామాజిక, సంస్కృతిక, సాహిత్య, సమకాలీన, సనాతన, విద్య తదితర రంగాలకు చెందిన పుస్తకాలను అభ్యసనమనేది నిరంతర ప్రక్రియగా అలవర్చుకోవాలని సూచించారు. విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.