గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నవీన్ అనే ఉపాధ్యాయుడిగా విద్యార్థినిల పట్ల నీచంగా ప్రవర్తించాడు. బాలికలను అసభ్యంగా తాగుతూ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చాడు. పాఠశాలకు వస్తున్న చిన్నారులతో తమ కామవాంఛలు తీర్చుకోవాలని చూశాడు నవీన్. రోజూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ కొంతమంది బాలికలను చెప్పలేని విధంగా తాకేవాడు. అతని చేష్టలను భరించలేని విద్యార్థినిలు సోమవారం తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు.
దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని వారంతా నిలదీశారు. అనంతరం నవీన్‌కు దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ పెద్దది కావడంతో పాఠశాల యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.