ఆకివీడు అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. నగర పంచాయతీ చైర్మన్ జామి హైమావతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆకి వీడు మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.
ఇటీవల దుంపగడపలో, నేడు అయి–భీమవరంలో మంచినీటి సమస్యతో తీవ్ర విషజ్వరాల తో జనం అల్లాడుతున్నారు. వాటిని నివారించేందుకే కాలువలు, చెరువులు బోదెల చుట్టూ ఆక్ర మణలు తొలగిస్తున్నాం. నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నా. ఆక్రమణల తొలగింపు సమయంలో రాజకీయ నాయకులు అడ్డుపడవద్దు. అర్హులుంటే పట్టాలు ఇస్తాం. గంగానమ్మకోడ్ ప్రాంతంలో ఆక్రమణలు పరిశీలించి, వారంలో తొలగించాలని అన్నారు. కమిషనర్ జి.కృష్ణమోహన్, పాల్గొన్నారు.