బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో మంగళవారం నాగులచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు నాగేంద్రుడిని దర్శించుకుని, గ్రామ సమీప పొలాల వద్ద పుట్టలకు కుటుంబాలతో వెళ్లి పూజలు నిర్వహించారు. బెల్లం, తాటిగుజ్జు, పాలు, సిమ్మిడి, గుడ్లు, అరటిపండ్లు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించారు. పుట్టల వద్ద చిన్నారులకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.