ఆర్మీ ఉద్యో గుల సేవలు అభినందనీయమని, వారి జీవితాలు త్యాగా లకు ప్రతీకలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల సంక్షేమ భవనంలో సోమవారం ఆ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉన్నారనే భరోసాతోనే ప్రతీ పౌరుడూ ధైర్యంగా ఉండగలుగుతున్నారన్నారు. కూటమిప్రభుత్వం వంద రోజుల పాలన లో మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి రూ.10 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశా నికి సుబేదార్ రామారావు అధ్యక్షత వహించారు. కార్యక్ర మంలో పలువురు సంఘ నేతలు, విశ్రాంత సైనికోద్యోగులు పాల్గొన్నారు.