అమరావతిలో కొత్త రైల్వేలైను వెళ్లే వడ్డమాను, వైకుంఠపురం తదితర గ్రామాల రైతులు తమ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి ముందుకొచ్చారని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై పది రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లాలా, లేక సేకరణ ద్వారా తీసుకోవాలా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
గతంలో నిర్ణయించినట్టు ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఈస్ట్, వెస్ట్ బైపా్‌సల నిర్మాణం చేస్తామన్నారు. రాజధాని పనులు ఓపెన్ టెండర్ల ద్వారా పిలుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గతంలో అమరావతిలో ప్రభుత్వం భూములిచ్చిన వారందరినీ పిలిచి మాట్లాడాలని సీఎం చెప్పారని, ఆయన కూడా టాటా, బిర్లా తదితరులతో మాట్లాడుతున్నారని మంత్రి తెలిపారు.