తిరుపతిలోని శిల్పారామంలో గల గేమ్ జోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. క్రాస్ జాయింట్ వీల్ ఊడి కిందపడిన ప్రమాదంలో ఒకరు మృతి, మరో యువతికి తీవ్ర గాయాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. గేమ్ జోన్ కాంట్రాక్టర్ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు.
శిల్పారామం ఏఓ ఖాధర్ వలి, కాంట్రాక్టర్ ప్రభాకర్‌తో కుమ్మక్కు కావడంతోనే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఎలాంటి బదిలీ లేకుండా శిల్పరామం ఏఓగా ఖాధర్ వలి పనిచేస్తున్న విషయం తెలిసిందే. గేమ్ జోన్లో తనిఖీలు నిర్వహించకపోవడం, ఏఓ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఏఓ ఖాధర్ వలిపై రాష్ట్ర సీఈఓ స్వామి నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.