విజయవాడ నగరంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చోడవరం నాగేంద్ర స్వామిదేవాలయం, అయ్యప్ప నగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకాలు చేస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోస్తుంటారు.