బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం ప్రశాంతి జిల్లా పరస్పర సహాయ సహకార సంఘాల ఫెడరేషన్ లిమిటెడ్ 20వ వార్షిక మహాజన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిఆర్డిఏ పీడీ ఈశ్వరయ్య, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.