కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే ప్రజల నుండి వ్యతిరేకత ఏదుర్కుంటోందని, సాక్షాత్తు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణే కూటమి ప్రభుత్వం పై పెదవీ విరుస్తున్నారని మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు.
బుధవారం గోరంట్లలో వైసిపి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం, ఫ్రి బస్ లాంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మద్యం షాపులను మంత్రి భర్త ప్రారంభించడం ఏంటని ఎద్దేవా చేశారు.