మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. YCP చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై చర్చించారు. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించినట్లు తెలిసింది.
ఫిర్యాదులు వస్తున్నా, కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని.. నెలలోగా వ్యవస్థను గాడిలో పెడదామని మంత్రులకు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.