అనంతపురం జిల్లా హెచ్ ఎల్ సి అధికారుల పనితీరుపై ప్రజలు రైతులు మండిపడుతున్నారు. పుట్లూరు మండలంలోని సుబ్బరాయుడు సాగర్ రిజర్వాయర్ కు రెండు గేట్లు ఉండగా అందులో ఒక గేట్ నుంచి నీరు లీక్ అవుతుంది.
అయితే మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఏకంగా గోడ నిర్మించి ఒక గేటు లేకుండా చేశారు. ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇలా చేయడం ఏమిటా అని ప్రజలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.