ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్‌పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా కోసమే అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ హోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా అని ప్రశ్నించారు.అసెంబ్లీకి వచ్చి మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగాలని అన్నారు. రాష్ట్ర సమస్యలు జగన్‌కు పట్టవని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనడం సరికాదని అన్నారు. అసెంబ్లీకి వస్తే స్పీకర్ తప్పకుండా మైక్ ఇస్తారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 40 శాతం ఓట్లు వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు.
సంఖ్యా బలాన్ని బట్టి స్పీకర్ ప్రతిపక్ష హోదా కల్పిస్తారని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని అన్నారు.అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని విమర్శించారు. ఇంటి వద్ద నుంచి ప్రశ్నలు సంధించే బదులు అసెంబ్లీకి వచ్చి జగన్ అడగాలన్నారు. ముందు అసెంబ్లీని గౌరవించి రావాలని.. అప్పుడు మైక్ ఇవ్వకపోతే మాట్లాడాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.