తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి.. ఆరు సంవత్సరాల తరువాత డిగ్రీ పాఠ్య ప్రణాళికను సమీక్షించి, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించింది.
ముఖ్యంగా తరగతి గది బోధనకు ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. ఉన్నత విద్యామండలి నిర్ణయించిన సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ముద్రించనుంది.