వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే.తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది.వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేశ్‌కు కలిపి ఒకే లేఖ రాశారు.శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపంఅందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.