ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం వచ్చింది. కరోనా విపత్కర సమయంలో డొమినికాకు అందించిన సహకారానికి ప్రతిఫలంగా ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అవార్డు వచ్చింది.ఇండియా-డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఇక గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేస్తామని తెలిపింది డొమినికా. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరగనున్న ఇండియా-కారికామ్ కార్యక్రమంలో డొమినికన్ ప్రెసిడెంట్ సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కాగా..భారతదేశం… డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ని సరఫరా చేసింది, దీని వలన దేశం తన కరేబియన్ పొరుగు దేశాలకు తన సహాయాన్ని అందించింది.