బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. ఏపీ శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, ఇశ్రాయేలు మాట్లాడారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. రూ.5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. పవర్ సెక్టార్‌పై చర్చ జరగకుండా చేశారు. పలు సమావేశాల్లో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు.
తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని తోట త్రిమూర్తులు అన్నారు. లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం. సోషల్ మీడియై పోస్టులపై చర్చకు కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు అమలు చేయకుండా కూటమి నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు అని వైసీపీ నేతలు వాపోతున్నారు.