ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని వైసీపీ నేత వరుదు కల్యాణి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతులకు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా వైయస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమంటారా?. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను మంత్రులు దెబ్బతీయాలని చూస్తున్నారు అని అన్నారు.