ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డుంబ్రిగుడ ఎస్ఐ పాపినాయుడు తెలిపారు. గురువారం డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ..హెల్మెట్ ధరించకపోవడంతో అనేకమంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారన్నారు.హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని తప్పనిసరిగా ధరించాలన్నారు.