ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాప్యులారిటీ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. సోషల్ మీడియాలో సరేసరి. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్... ఇలా ఏ సోషల్ మీడియా వేదిక చూసినా మోదీ ఫాలోవర్స్ సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ఇదిలా ఉంటే... పురస్కారాల పరంగానూ మోదీ అరుదైన ఘనత సాధించారు. వివిధ దేశాలు అందించే అత్యున్నత పౌర పురస్కారాలు పొందినవారిలో మోదీనే నెంబర్ వన్. ఇప్పటివరకు ఆయన 14 అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. మరే ప్రపంచ నేతకు ఇన్ని అవార్డులు దక్కలేదు.
మోదీ పురస్కారాల జాబితా...
1. కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ పురస్కారం- సౌదీ అరేబియా (2016)
2. స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్- ఆఫ్ఘనిస్థాన్ (2016)
3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డ్ - పాలస్తీనా (2018)
4. ది ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డ్- యూఏఈ (2019)
5. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్- రష్యా (2019)
6. ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్- మాల్దీవులు (2019)
7. కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ రెనైస్సాన్స్- బహ్రెయిన్ (2019)
8. లెజియన్ ఆఫ్ మెరిట్- అమెరికా (2020)
9. ది ఆర్డర్ ఆఫ్ ది ద్రుక్ గ్యాల్పో- భూటాన్ (2021)
10. ఎబ్కాల్ అవార్డ్- రిపబ్లిక్ ఆఫ్ పలావ్ (2023)
11. ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ- ఫిజీ (2023)
12. గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ లోగోహు- పాపువా న్యూ గినీ (2023)
13. ది ఆర్డర్ ఆఫ్ నైల్- ఈజిప్ట్ (2023)
14. ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్- ఫ్రాన్స్ (2023)
ఇవి కాకుండా, అనేక దేశాల ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారాలు, వివిధ సంస్థల అవార్డులు కూడా ప్రధాని మోదీ చాలా అందుకున్నారు. మరి కొన్ని దేశాలు పురస్కారాలు ప్రకటించగా, వాటిని స్వీకరించాల్సి ఉంది.